F 35 Fighter Down : అమెరికా ఎఫ్​ 15 మటాష్​ Andhra Prabha News

F 35 Fighter Down : అమెరికా ఎఫ్​ 15 మటాష్​ Andhra Prabha News

  • ఇరాన్​ ప్రకటన
  • అమెరికా నో కామెంట్​
  • ఖోర్దాద్-15 తో దాడి
  • ఇది రెండవ అమెరికా ఫైటర్​ జెట్​

( ఆంధ్రప్రభ, టెహ్రాన్​ ప్రతినిధి)

F 35 Fighter Down : యుద్దం వద్దు.. యుద్ధం వద్దు రాజీ పడదాం ,, రాజీ పడక పోతే ఇరాన్​ ను నాశనం చేస్తామని అమెరికా పదే పదే హెచ్చిరస్తున్నప్పటికీ.. ఇరాన్​ ఎక్కడ తగ్గటం లేదు. శుక్రవారం తెల్లవారుజామున మరొక అమెరికా F-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్లు ఇరాన్​ ప్రకటించింది.

F 35 Fighter Down

F 35 Fighter Down : ఇరాన్ అధికారిక మీడియా నివేదికల ప్రకారం, ఈ విమానాన్ని ఇరాన్ గగనతలంలో పశ్చిమ ఇరాన్ సరిహద్దుల్లో కూల్చివేసినట్లు ప్రకటించింది. ఇది రెండో F-35 విమానం కావడం గమనార్హం. 2026 మార్చి 19న మధ్య ఇరాన్​ లో తొలి విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది

F 35 Fighter Down

ఇరాన్ తన సొంతగా తయారు చేసిన అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ “ఖోర్దాద్-15” ఈ జెట్‌ను నేలకూల్చినట్లు పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంత యుద్ధ విమానంగా పేరున్న F-35ని కూల్చివేసి తమ రక్షణ వ్యవస్థ ఎంత బలంగా ఉందో చాటి చెప్పాలని ఇరాన్ భావిస్తోంది. విమానం కూలిన తర్వాత భారీ పేలుడు సంభవించినందున, పైలట్ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని ఇరాన్ మీడియా పేర్కొంది. తమ కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో ఈ అత్యుధునిక విమానాన్ని కూల్చివేశామని ఇరాన్ ప్రకటించింది.

F 35 Fighter Down : అమెరికా నో కామెంట్​

F 35 Fighter Down

అమెరికా రక్షణ శాఖ . మంత్రి పీట్ హెగ్‌సెత్ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. సాధారణంగా ఇలాంటి కీలక యుద్ధ విమానాల నష్టాన్ని అమెరికా వెంటనే ఒప్పుకోదు. ఈ ఘటన తర్వాత పశ్చిమ ఆసియాలో అమెరికా విమాన వాహక నౌకలు , వైమానిక దళం మరింత అప్రమత్తమయ్యాయి.

ALSO READ : 3 Us Officials Dismissed : అమెరికా ఆర్మీ చీఫ్ ఔట్ Andhra Prabha Insight Story

Leave a Reply