ఝార్ఖండ్‌లో ఎన్కౌంటర్
వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఝార్ఖండ్ Jharkhandలో హజారీబాగ్ జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల(Maoists) మధ్యఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టు పెద్ద నాయకులు ప్రాణాలు కోల్పోయారు. 209 బెటాలియన్(Battalion) కోబ్రా దళాలు గోర్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతిత్రి అడవుల్లో జాయింట్ ఆపరేషన్ చేపట్టగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
ఎదురు కాల్పుల్లో సహదేవ్ సోరెన్ (Sahadev Soren)ను మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడిగా భావిస్తున్నారు. ఆయనపై రూ.1 కోటి రివార్డు ఉంది. మరో మావోయిస్టు రఘునాథ్ హేమంబరం(Hemambaram) స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు.
అతడిపై రూ.25 లక్షల బహుమతి ఉంది. ఇక జోనల్ కమిటీ సభ్యుడు వర్సెన్ గంజూ కూడా వీరిలో ఉన్నాడు. అతడిపై ప్రభుత్వం రూ.10లక్షల రివార్డు ప్రకటించింది. ఈ ఎన్కౌంటర్ సందర్భంగా తాము మూడుఝార్ఖండ్లో ఎన్‌కౌం ఏకే-47 రైఫిళ్లను(Rifles) స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. భద్రతా దళాలు ఆ ప్రదేశంలో కూంబింగ్‌ను కొనసాగిస్తున్నాయి.

