Electric Shock | కరెంట్ షాక్‌తో….

Electric Shock | కరెంట్ షాక్‌తో….

Electric Shock | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సూర్యాపేట జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తాటి ముంజలు కోయడానికి ప్రయత్నించిన బాలుడు హైటెన్షన్ వైర్ తగిలి కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం గాజుల మల్కాపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిఖిల్(14) అనే 8వ తరగతి విద్యార్థి తాటి ముంజలు కోయడానికి ఐరన్ పైపు ఉపయోగిస్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు.

ఐరన్ పైపు అనుకోకుండా సమీపంలోని హైటెన్షన్ విద్యుత్ తీగను తాకడంతో అతనికి తీవ్ర కరెంట్ షాక్ తగిలింది. దీంతో నిఖిల్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో అతని స్నేహితుడు మణికంఠకు కూడా గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ నిఖిల్ చనిపోయాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. నిఖిల్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply