ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు ముగింపు

ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు ముగింపు

  • పరీక్ష కేంద్రం నుండి బయటకు వచ్చి విజయకేతనం చూపిస్తున్న విద్యార్థినిలు,.

భీమ్‌గల్ టౌన్/రూరల్, ఆంధ్ర‌ప్ర‌భ : విజయవంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు భీమ్‌గల్ మండలంలోని బాలికల పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల ముచ్కూర్, పల్లికొండ గ్రామాలలో పదో తరగతి వార్షిక పరీక్షలు నాలుగు పరీక్ష కేంద్రాలలో నిర్వహించామని మండల విద్యాశాఖ అధికారి డి.స్వామి తెలిపారు. సోమవారంతో ప్రశాంతంగా ముగిశాయి. గత నెల మార్చి 14న ప్రారంభమైన ఈ పరీక్షలు, నేడు (ఏప్రిల్ 13) చివరి పరీక్షతో విజయవంతంగా పూర్తయ్యాయి. ఎక్కడా ఎలాంటి మాస్ కాపీయింగ్ లేదా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మండల విద్యాశాఖ అధికారి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

పరీక్షలు ముగియ‌డంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించగా, విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించారు. చివరి పరీక్ష పూర్తికాగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్ద ఆనందంతో బయటకు వచ్చారు. కొంతకాలంగా పరీక్షల ఒత్తిడిలో ఉన్న విద్యార్థులు పరీక్షలు ముగియడంతో ఉపశమనం పొందారు.

మండలంలోని నాలుగు పరీక్ష కేంద్రాలలో 704 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి ఒక్కరు కూడా గైరాజార్ కాకుండా ఈ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణను కట్టుదిట్టంగా విద్యాశాఖ అధికారి డి.స్వామి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

పరీక్షలు ముగిసిన అనంతరం విద్యార్థులు స్నేహితుల తో కలిసి ఫోటోలు దిగుతూ, ఆనందాన్ని పంచుకున్నారు. కొందరు విద్యార్థులు తమ పరీక్షలు బాగా జరిగాయని ఆనందం వ్యక్తం చేయగా, మరికొందరు ఫలితాలపై ఆశాభావం వ్యక్తం చేశారు. పరీక్షల అనంతరం వేసవి సెలవులు ప్రారంభమవడంతో విద్యార్థులు విశ్రాంతికి సిద్ధమవుతున్నారు. ఇక ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని పలువురు విద్యార్థులు తెలిపారు.

Leave a Reply