Drugs| మాదకద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ

Drugs| మాదకద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ

Drugs | భీమ్‌గల్ టౌన్ /రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ (Bheemgal) పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఎక్సైజ్ శాఖ అధికారులు రక్షణ శాఖ అధికారుల మాదకద్రవ్యాల నిరోధన అనే విషయంపై అబ్కారీ పోలీస్ శాఖ (Excise Police Department) ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అబ్కారి శాఖ సీఐ వేణు మాధవరావు, అబ్కారి శాఖ ఎస్సై గోవర్ధన్, ఎస్సై కే.సందీప్ మాట్లాడుతూ… విద్యార్థులు ఏ ఒక్కరు కూడా ఈ మాదకద్రవ్యాల వలలో పడకుండా వాటికి బలికాకుండా ఉండాలని కోరారు.

ఏ ఒక్కరు కూడా ఇటువంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరిని మేలుకొలుపుతూ డ్రగ్స్ నివారిత గ్రామాలుగా మార్చడంలో ప్రతి ఒక్కరి చేయూత అవసరం కాబట్టి మీరందరూ ఈ డ్రగ్స్ (Drugs) ను నివారించడంలో పాలు పంచుకోవాల‌న్నారు. విద్యార్థినీ విద్యార్థులు, యువత ఈ మత్తు పదార్థాల వలలో చిక్కుకున్నట్లయితే విద్యను పొందడంలో కానీ ఎంప్లాయ్మెంట్ ను అందుకోవడంలో కానీ, పాస్ పోర్టును తీసుకోవడంలో కానీ ఇలా ఎలాంటి ప్రభుత్వ లాభదాయకమైన వసతులను పొందడానికి అనర్హులుగా ప్రకటించబడతారన్నారు.

కాబట్టి ఇలాంటి మత్తుపదార్థాల జోలికి వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే మాదకద్రవ్యాల నివారణ అనే అంశంపైన ప్రతిజ్ఞ (pledge) చేయించడం జరిగింది. ఇందులో భాగంగా ఎక్సైజ్ శాఖ సీఐ వేణు మాధవరావు, ఎక్సైజ్ శాఖ ఎస్సై గోవర్ధన్, రక్షణ శాఖ అధికారి ఎస్సై కే.సందీప్, ఏ.ఎస్.ఐ అబ్దుల్ సత్తార్, ఎక్సైజ్ శాఖ అధికారులు, కళాశాల ప్రిన్సిపల్ సి. జైపాల్ రెడ్డి, కౌన్సిలర్ పల్లె శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ మండలోజు నర్సింహస్వామి, పోలీస్ అధికారులు, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply