CI Mandavi|అవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

శాంతి-భద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలి..
ఉట్నూర్ సీఐ మండావి ప్రసాద్
CI Mandavi|ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ పట్టణంలో ఆదివాసి సంఘాలు ఆదివారం నిర్వహించే ధర్మ యుద్ధ సభ సందర్భంగా ఎలాంటి శాంతిభద్రతల ఉల్లంఘన చోటుచేసుకోకుండా అందరూ సహకరించాలని ఉట్నూర్ సీఐ మండావి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
సీఐ మాట్లాడుతూ… సభ కారణంగా ఉట్నూర్ మార్కెట్ పూర్తిగా బంద్ పాటించాలని, అత్యవసర పరిస్థితులలో తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. సభకు వచ్చే ఆదివాసులు తమ వాహనాలను పోలీసులు సూచించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలిపేయాలని కోరారు.
ఆదిలాబాద్ నుంచి ఉట్నూర్ మీదుగా మంచిర్యాల వెళ్లే వాహనదారులు, ట్రాఫిక్ రద్దీ నివారించేందుకు నిర్మల్ మార్గం ద్వారా ప్రయాణించాల్సిందిగా ఆయన సూచించారు.
సభ సందర్భంగా ఎలాంటి అల్లర్లు, గొడవలు లేకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఐ మండావి ప్రసాద్ పిలుపునిచ్చారు. శాంతి–భద్రతల కోసం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలు, వ్యాపారవేత్తలు, ఆదివాసి సంఘాల నాయకులు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన కోరారు
