పంచాయితీ కార్మికులకు దుస్తులు పంపిణీ

దమ్మపేట, ఆంధ్రప్రభ : పంచాయితీ పారిశుధ్య కార్మికులకు దమ్మపేట మాజీ వైస్ ఎంపీపీ , బిఆరెస్ నాయకులు దారా మల్లిఖార్జునరావు శనివారం దుస్తులను పంపిణీ చేశారు .మాజీ వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు తన వివాహ దినోత్సవం సందర్భంగా దమ్మపేట పారిశుధ్య కార్మికులకు , 30 మంది పేదవారికి దుస్తులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో దమ్మపేట మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు ,చిన్నశెట్టి సత్యనారాయణ , యార్లగడ్డ బాబు , పానుగంటి చిట్టిబాబు ,సీకే నాగార్జున , సత్యనారాయణ ,పద్మ తదితరులు పాల్గొన్నారు.
