ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు – 10 (ఆడియోతో…)

భాగవతం, ఏకాదశ స్కందంలోని ఋషి ప్రభోదం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….

యధాజలస్థ ఆభాస: స్థల స్థేనావ దృశ్యతే
స్వాభాసేన యధాసూర్య: జలస్థేన దివిస్థిత:

ఏవం త్రివృదహంకార: భూతేంద్రియ మనోమయై:
స్వాభాసై: లక్షితో నేన సదాభాసేన సత్యదృక్‌

నేలపై ఉన్నవాడు, నీటిలోని ప్రతిబింబాన్ని చూస్తాడు. ఆకాశంలో ఉన్న సూర్యుడు జలంలో ఉన్న ప్రతిబింబాన్ని చూస్తాడు. అలాగే సాత్విక, రాజస, తామస అహంకారాలు భూత, ఇంద్రియ మనోమయమైన తన అభాసములను చూస్తూ, తెలియని వాడు అదే నిజమనుకుంటాడు, తెలిసిన వాడు నీడ అనుకుంటాడు.

అనగా ఒడ్డున ఉన్నవాడు తన నీడను నీటిలో చూస్తాడు కానీ అది ప్రతిబింబం మాత్రమే. అలాగే ఆకాశంలో ఉన్న సూర్యుని ప్రతిబింబం నీటిలో కనపడుతుంది. నీటిలో రాయి వేస్తే అలలు కదిలి, సూర్యుడు కదిలినట్లు కనబడతాడు కాని నిజానికి సూర్యుడు కదలడు నీటిలో ఉన్న తన ప్రతిబింబం మాత్రమే కదులుతుంది. అలాగే శరీరములో ఇంద్రియములలో, మనస్సులో కలిగే వికారాలు, చేసే పనులు, కోరే కోరికలు ప్రతిబింబాలే కాని వాస్తవము కాదు. అంటే శరీర, ఇంద్రియ, మనస్సులతో చేసే పనులు, కలిగే అనుభూతులు ఆత్మవి కావు, అవి ఆత్మకి అంటవు.

–శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *