Real Boom | రియల్‌రంగంలో ది బెస్ట్‌ స్టేట్‌.. దేశంలోనే రెండో స్థానంలో !

  • త్వరలోఎ మరింత పైపైకి

రాష్ట్రం మళ్లి రియల్‌రంగంలో పునరుత్తేజం దిశగా ఎదుగొందుతోంది. రియల్‌రంగంలోని ఒక్కో రంగం ఒక్కో తీరుగా వెలుగులీనుతోంది. జిల్లాల్లో కొంతమేర ఆదాయం తగ్గినప్పటికీ మెట్రో నగరం హైదరాబాద్‌ నగరం రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రధానంగా ఆఫీస్‌ స్పేస్‌లో దేశంలోనే గొప్ప నగరంగా మారుతోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్‌ రంగం కాస్త వెనుకబడినట్లు అనిపించింది. సేల్స్‌ నెమ్మదించాయి. కొత్త లీజింగ్‌ ట్రాన్సాక్షన్స్‌ తగ్గిపోయినట్లు పలు కన్సల్టెన్సీలు రిపోర్టులు వెల్లడించాయి. అయితే మళ్లీ ఇప్పుడు ఈ ఆర్ధిక సంవత్సరం చివర్లో కార్యాలయ స్థలాలకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది.

ప్రముఖ సంస్థలు తమ వ్యాపార విస్తరణ కోసం హైదరాబాద్‌ నగరాన్ని కీలక స్థానంగా భావిస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌ పెరిగేందుకు ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలతో పాటుగా అనుకూలంగా ఉండే వ్యాపార విధానాలు, స్థిర ప్రభుత్వం వంటివి తోడ్పడుతున్నట్లు నివేదిక పేర్కొంది.

ఇంకా ఇతర ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే స్థిరాస్తి ధరలు అందుబాటులో ఉండటం.. నిపుణుల లభ్యత కూడా అనుకూలంగా ఉండటం వంటివి కారణంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌పై ఇన్వెస్టర్లు, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు, ఇతర సంస్థలు కూడా సానుకూలంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

సమీప భవిష్యత్‌ విస్తరణ ప్రణాళికలకు వీలుండేలా చూసుకోవడం సహా ఆధునిక వసతులు, కీలక ప్రాంతాల్లోని గ్రేడ్‌ ఏ కమర్షియల్‌ ప్రాజెక్టులకు ఎక్కువ డిమాండ్‌ ఉందని రిపోర్ట్‌ తెలిపింది.

అంతర్జాతీయ సంస్థల నుంచి డిమాండ్‌ పెరుగుతుండడం, పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతున్న తరుణంలో హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పెస్‌ డిమాండ్‌ అంచనాలకు మించి పెరిగిపోతుందని.. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ సంస్థ – సీబీఆర్‌ఈ వెల్లడించింది.

ఈ సంస్థ హైదరబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్పైసెస్‌ అసోషియేషన్‌ సంయుక్తంగా విడుల చేసిన నివేదికలో.. దేశీయంగా మిగతా నగరాలతో పోల్చితే ఆఫీస్‌ స్పెస్‌ కు హైదరాబాద్‌ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారిందని ఈ నివేదిక వెల్లడిస్తోంది. రానున్న రోజుల్లో ఈ డిమాండ్‌ ఇలానే పెరుగుతూ.. 2030 నాటికి 20 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంటోందని వెల్లడించింది.

ప్రస్తుతం నగరంలో 1.37 కోట్ల చదరపు అడుగుల మేర ఆఫీస్‌ స్పేస్‌ వినియోగంలో ఉన్నట్లు తెలిపిన ఈ నివేదిక.. గత పదేళ్లతో పోల్చితే దాదాపు మూడు రెట్ల ఆఫీస్‌ స్పేస్‌ హైదరాబాద్‌ నగరంలో అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది.

ప్రస్తుతం దేశంలో ఐటీ సహ ఇతర విభాగాల్లో అనేక సంస్థలున్న బెంగళూరు, దిల్లీ, చెన్నై వంటి నగరాల కంటే హైదరాబాద్‌ వైపు ఇంటర్నేషనల్‌ సంస్థలు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలిపిన సీబీఆర్‌ఈ నివేదిక.. ప్రధాన నగరాల్లో ఉన్న ఆఫీసు స్థలంలో హైదరాబాద్‌ వాటా 15శాతంగా ఉన్నట్లు వెల్లడించింది.

ఇందులో 18శాతం గ్రీన్‌ సర్టిఫైడ్‌ ఆఫీస్‌ స్టాక్‌గా పేర్కొంది. హైదరాబాద్‌ నగరంలో 2024లో 1.23 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ బుకింగ్‌ అయ్యింది. ఇందులో.. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డాటా అనలటిక్స్‌ వంటి రంగాలు ఎక్కువగా ఆఫీస్‌ స్పేస్‌ రెంట్‌కు తీసుకున్నట్లు వెల్లడైంది.

మొత్తంగా టెక్నాలజీ సంస్థల వాటానే 31శాతంగా ఈ నివేదిక వెల్లడించింది. గతంలో ఐటీ రంగాలకు చెందిన సంస్థల నుంచి 30-35 శాతం డిమాండ్‌ ఉంటుండేది. కానీ.. ఇప్పుడు ఇతర రంగాల నుంచి సైతం పోటీ ఎక్కువ అవుతుండడం, ఆయా రంగాల సంస్థలు ఎక్కువగా ఆఫీస్‌ స్పేస్‌ రెంటుకు తీసుకుంటుండడంతో ఐటీ సంస్థల వాటా తగ్గిపోతున్నట్లు నివేదిక తెలిపింది.

మొత్తంగా హైదారాబాద్‌ నగరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బయో టెక్నాలజీ, ఫైనాన్స్‌ రంగాల సంస్థలు హైదరాబాద్‌ లో పెట్టుబడులు పెట్టేందుకు, ఇక్కర అద్దెలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లు ఎక్కువగా ఏర్పాటవుతున్నాయి.

రెండేళ్ల కాలంలోనే ఈ సంస్థల ఆఫీస్‌ స్పేస్‌ వినియోగంలో 12శాతం వృద్ధి రేటు నమోదైంది. గతేడాది ఆఫీస్‌ స్పేస్‌ తీసుకున్న మొత్తం సంస్థల్లో బీసీసీల వాటానే 43శాతంగా ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ సంస్థల ఏర్పాటులో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

జీసీసీల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్‌ నగరం రెండో స్థానంలో ఉంది. గత ఏడాదిలో 53 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలాన్ని జీసీసీలు అద్దెకు తీసుకున్నాయి.

రానున్న పదేళ్లలో 1.5 రెట్ల మేర పెరుగుదల…

రానున్న ఐదేళ్లల్లో హైదరాబాద్‌ ఆఫీస్‌ స్పేస్‌ గిరాకీ 1.5 రెట్లు పెరుగుతుందని ఈ నివేదిక అంచనా వేస్తోంది. ఈ స్థాయిలో ఆఫీస్‌ స్పేస్‌ పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రధాన కారణమని విశ్లేషించిన నివేదిక.. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చోరవతోనే ఇది సాధ్యపడుతోందని ప్రశంసించింది.

మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిరంతరం దృష్టి సారించడంతో పాటు, ఆఒ, రోబోటిక్స్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో పెరుగుతున్న పెట్టుబడులతో హైదరాబాద్‌ కు ఈ డిమాండ్‌ ఏర్పాటినట్లు తెలుపుతోంది.

అలాగే.. ఇక్కడి బలమైన పర్యావరణ వ్యవస్థ, నైపుణ్యం కలిగిన యువత లభిస్తుండడంతో గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్స్‌ ఏర్పాటు సాధ్యమవుతోందని తెలిపింది. పైగా నగరంలో తక్కువ ధరల్లోనే అద్భుతమైన స్పేస్‌ అందుబాటులోకి రావడంతో పాటు ఇక్కడి వసతులు, వనరులు పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకంగా పనిచేస్తున్నట్లు నివేదిక తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *