సౌందర్య లహరి

72. సమం దేవి స్కంద ద్విపవదనపీతం స్తన యుగం
తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుత ముఖం
య దాలోక్యాశంకాకులితహృదయోహాసజనకః
స్వకుమ్భేహేరంభఃపరిమృశతిహస్తేనఝటితి.

తాత్పర్యం: ఓ జగన్మాతా! కుమారస్వామి, వినాయకుల చేత ఒకేమారు పాలు త్రాగబడుతూ ఉన్నవి, పాలని స్రవించే అగ్రభాగాలు ఉన్నవి అయిన నీ కుచములను చూచి వినాయకుడు తన తలపై ఉండే కుంభాలు దొంగిలింప బడి ఇక్కడ ఉన్నాయా? అనే అనుమానంతో తన కుంభస్థలాన్ని తొండంతో తడిమి చూసుకుంటుంటే చూసి నీకు కుమారస్వామికి నవ్వు వచ్చింది. అటువంటి నీ స్తనయుగము మా దుఃఖములను పోగొట్టును గాక.

  • డాక్ట‌ర్ అనంత‌ల‌క్ష్మి

Leave a Reply