Telangana | శివాలయాల్లో కార్తీక మాస శోభ…

Telangana | శివాలయాల్లో కార్తీక మాస శోభ…

భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు..


Telangana | ఊట్కూర్, ఆంధ్రప్రభ : కార్తీక అమావాస్యను పురస్కరించుకొని తెలంగాణ – కర్ణాటక (Telangana – Karnataka) సరిహద్దుల్లో నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని సమస్త పూర్ సమీపంలో వెలసిన ఇడ్లూరు శ్రీ శంకర్ లింగేశ్వర స్వామి (Sri Shankar Lingeshwara Swamy) దేవాలయంతో పాటు ఆయా శివాలయాల్లో గురువారం కార్తీక అమావాస్య కావడంతో భక్తులు శివాలయాల్లో భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు.

ప్రతి ఏడాది కార్తీక మాసం అమావాస్య రోజు శివాలయాల్లో కార్తీక పూజలు, దీపారాధన వేడుకలు చేపట్టడంతో ఆయా దేవాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం (Sri Ayyappa Swamy Temple) లో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహానికి మాలధారణ స్వాములు, భక్తులు అభిషేకం నిర్వహించారు.

ఊట్కూర్ మండల కేంద్రంలోని ఈశ్వర్ మందిర్, వివేకానంద చౌరస్తా వద్ద, శివాలయం, భరత్ నగర్ వద్ద శివాలయం, వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో తిప్రాస్ పల్లి శివాలయం, నిడుగుర్తిగుట్టపై శివాలయంలో, పులిమామిడి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మొగ్దుమ్, పూర్ శివారులో మూగ బసవేశ్వర స్వామి, తోపాటు ఆయా శివాలయాల్లో భక్తులు (devotees) వేకువజామున నుండి రుద్రాభిషేకాలు అభిషేకం విశేష పూజలు చేపట్టి తమ భక్తిని చాటారు. ఆయా దేవాలయాలతో పాటు తమ ఇళ్ల వద్ద కార్తీక దీపాలు వెలిగించి నైవేద్యం సమర్పించి మొక్కలు చెల్లించుకొని అన్నదాన కార్యక్రమాలునిర్వహించారు.

Leave a Reply