delhi player miller| మిల్ల‌ర్… కిల్ల‌ర్‌

delhi player miller| మిల్ల‌ర్… కిల్ల‌ర్‌

ఒక్క (త‌ప్పు) ర‌న్‌తో ఢిల్లీ ఓట‌మి

డేవిడ్ మిల్ల‌ర్‌పై ఫ్యాన్స్ ఫైర్‌
ఐదో బంతికి సింగిల్ తీయ‌క‌పోవ‌డంపై ఆగ్ర‌హం
వేద‌న‌కు గురైన మిల్ల‌ర్‌
ఓదార్చిన ఢిల్లీ కెప్టెన్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : పొట్టి ఫార్మ‌ట్ మ్యాచులంటే ఉత్కంఠను క‌లిగిస్తాయి. ఒక్కోసారి చివ‌రి బంతివ‌ర‌కు ఏ జ‌ట్టు విజ‌యం సాధిస్తుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఒక్క వికెట్‌తో, ఒక్క ప‌రుగుతో ఓడిపోయిన మ్యాచులు ఎన్నో ఉన్నాయి. ఒక్కోసారి ఆట‌గాడు చేసే చిన్న‌పొర‌పాటు వ‌ల్ల కూడా కొన్నిసార్తు అప‌జ‌యాన్ని మూట‌గ‌ట్టుకోవాల్స వ‌స్తుంది. అలాంటి పొర‌పాటే నిన్న (బుధ‌వారం) ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ మ‌ధ్య జ‌రిగిన మ్యాచులో చోటుచేసుకుంది. డేవిడ్ మిల్ల‌ర్ చేసిన చిన్న‌పారపాటు కార‌ణంగా ఢిల్లీ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.

ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య‌ మ్యాచ్ క్లైమాక్స్ చేరుకుంది. ఢిల్లీ విజయానికి చివరి రెండు బంతుల్లో కేవలం రెండు పరుగులు కావాలి. క్రీజులో డేవిడ్ మిల్లర్ వంటి హిట్టర్ ఉన్నాడు. ఐదో బంతిని ఎదుర్కొన్న మిల్లర్, సులభంగా సింగిల్ తీసే అవకాశం ఉన్నప్పటికీ వద్దని వారించాడు. తనే స్ట్రైకింగ్‌లో ఉండి ఆఖరి బంతికి సిక్స్ లేదా ఫోర్ కొట్టి జ‌ట్టును గెలిపించాల‌ని భావించాడు. అతివిశ్వాసంతో రన్ తీయలేదు. కానీ అదే జ‌ట్టుకు న‌ష్టం క‌లిగించింది. ఆఖరి బంతికి కనీసం ఒక పరుగు తీసి మ్యాచ్‌ను టై చేద్దామని ప్రయత్నించిన క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న కుల్దీప్ యాదవ్ రనౌట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ ఒక్క పరుగు తేడాతో ఓటమిని చవిచూసింది. ఒకవేళ ఐదో బంతికి సింగిల్ తీసి ఉంటే మ్యాచ్ కనీసం సూపర్ ఓవర్ వరకు వెళ్లేదని, మిల్లర్ చేసిన తెలివి త‌క్కువ త‌నానికి ఢిల్లీ జట్టు మూల్యం చెల్లించుకుంద‌ని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఎక్కెక్కి ఏడ్చిన మిల్ల‌ర్‌
మ్యాచ్ ఓడిపోవ‌డంతో డేవిడ్ మిల్ల‌ర్ తీవ్రంగా బాధ ప‌డ్డాడు. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ అత‌న్ని ఓదార్చే ప్రయత్నం చేశాడు. తన పొరపాటు వల్లే జట్టుకు దక్కాల్సిన రెండు పాయింట్లు చేజారాయని డేవిడ్ మిల్లర్ వేద‌న‌కు లోన‌య్యాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన తర్వాత మిల్లర్ తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాడు. ముఖాన్ని చేతులతో దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించాడు. గెలిపించాల్సిన మ్యాచ్‌ను ఓడించాననే బాధ మిల్లర్ కళ్లలో స్పష్టంగా కనిపించింది.

Leave a Reply