Cpi |ఆర్డిటి విషయంలో కేంద్ర–రాష్ట్రాల ద్వంద్వ వైఖరి

Cpi |ఆర్డిటి విషయంలో కేంద్ర–రాష్ట్రాల ద్వంద్వ వైఖరి

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ ఆరోపణ

Cpi | అనంతపురం ,ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు కీలక సేవలు అందిస్తున్న ఆర్డిటి సంస్థపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి వెనుక రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ ఆరోపించారు.మంగళవారం సిపిఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామితో కలిసి సిపిఐ కార్యాలయంలో విలేకరులతో డి.జగదీష్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా ఎడారి కాబోతుందని ఇక్కడ పేదరికము అధికంగా ఉందనే విషయాన్ని రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు నిర్మించి సవంత్సరములో విదేశీ ఆర్థిక సహకారంతో పేదరిక నిర్మూలనకు కంకణం కట్టుకున్న ఆర్ డి టి ఎఫ్‌సిఆర్ఏ నిధుల రిన్యూవల్ నిలిపివేయడం ద్వారా ఆర్డిటిని రాష్ట్రం నుంచి తరిమివేయాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు.


ఎన్డీఏ ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి నినాదాలు చేస్తూ, మరోవైపు నిస్వార్థ సేవలు అందిస్తున్న సంస్థలను అణిచివేయడం ప్రజావ్యతిరేక విధానానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. బత్తలపల్లి, కళ్యాణదుర్గం, కనేకల్ వివిధ ప్రాంతాల్లో ఆసుపత్రుల మూసివేతకు కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎఫ్‌సిఆర్ఏ సమస్య పరిష్కరిస్తామని చెప్పిన హామీలు అమలుకాకపోవడం రాజకీయ అవకాశవాదాన్ని బయటపెడుతోందన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ప్రజలకు ఇచ్చిన హామీలకు సమాధానం చెప్పాలన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ వంటి పథకాల విషయంలో కేంద్రంపై ప్రశ్నించకుండా, మోడీ–అమిత్ షా అనుకూల వైఖరి అవలంబించడం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని విమర్శించారు. ఆర్డిటి లాంటి సంస్థలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతే, తిరిగి తీసుకురావడం సాధ్యం కాదని హెచ్చరించారు.

ఈ అంశంపై పార్లమెంటులో అధికార, ప్రతిపక్ష పార్టీలు కేంద్రాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఆర్డిటి పరిరక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా ప్రజా ఉద్యమం అవసరమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 14న అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు జగదీష్ తెలిపారు.సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు జి.సంతోష్ కుమార్, శ్రీశైలం రాజేష్ గౌడ్, నగర సహాయ కార్యదర్శి వి.కృష్ణుడు, అల్లీపూరా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply