3వ వార్డులో మౌళిక సదుపాయాలు కల్పిస్తా..

3వ వార్డులో మౌళిక సదుపాయాలు కల్పిస్తా..
- కౌన్సిలర్ నాగలక్ష్మి చంద్రశేఖర్
హుజూర్నగర్, ఆంధ్రప్రభ ; హుజూర్నగర్ మున్సిపల్ పరిధిలో 3వార్డ్ ఎన్జీవోస్ కాలనీ, గణేష్ నగర్ లో సోమవారం కౌన్సిలర్ సులువ నాగలక్ష్మి చంద్రశేఖర్ అధ్వర్యంలో వీధిలైట్లను సిబ్బందితో వేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పూర్తిస్థాయిలో ఎన్జీవోస్ కాలనీ గణేష్ నగర్ చైతన్య కాలనీ వీధుల్లో వీధిదీపాలు, డ్రైనేజీ, పారిశుధ్యం నూతన సిసిరోడ్ల నిర్మాణం చేసి, సీసీ కెమెరాల సంఖ్య పెంచి వార్డులో ఎటువంటి అమాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి, కౌన్సిలర్ పులిచింతల వెంకటరెడ్డి, వార్డ్ ప్రజలు భవాని, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
