ఇంకా ఎన్ని రోజులు నిర్లక్ష్యం..?

ఇంకా ఎన్ని రోజులు నిర్లక్ష్యం..?

ప్రమాదకరంగా ముక్తుంకుంట కట్ట కింద 500 మీటర్ల దారి
అర్ధాంతరంగా నిలిచిన యాదవ సంఘ కమ్యూనిటీ హాల్ నిర్మాణం
నిధుల వినియోగంపై అనుమానాలు
గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
కిందస్థాయి అధికారుల నిర్లక్ష్యమే కారణమా..?
పలుమార్లు అడిగినా స్పందన లేదు
అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితా..?

స్టేషన్ ఘన్ పూర్,ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని సముద్రాల గ్రామంలో నెలకొన్న సమ స్యలపై ఏడాది కాలంగా అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్నప్పటికీ పరి స్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీ శాఖకు చెందిన సంబంధిత అధి కారులు పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి.

గ్రామంలోని సమస్యలు ఇవే..

గ్రామంలోని 3వార్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని ముక్తుంకుంట కట్ట కింద ఉన్న సుమారు 500 మీటర్ల మట్టి దారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ దారి మూడు వీధుల ప్రజలకు మాత్రమే కాకుండా 100మందికి పైగా రైతులకు ప్రాణా ధారంగా ఉంది. అంతేకాకుండా స్మశానవాటికకు వెళ్లే ఏకైక మార్గం కూ డా ఇదే కావడంతో గ్రామస్తులు తప్పనిసరిగా ఈ ప్రమాదకర మార్గాన్నే ఉపయోగించాల్సి వస్తోంది. వర్షాకాలంలో గుంతలు, మురుగునీరు, వర్షపు నీరు కలిసి బురదగా మారి తీవ్ర ప్రమాదాన్ని సృష్టిస్తున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఎప్పుడైనా జారిపడే పరిస్థితి నెలకొంది. రైతులు తమ పొలాలకు వెళ్లడమే కష్టసాధ్యంగా మారింది. మరోవైపు మురు గునీటి పారుదల వ్యవస్థ పూర్తిగా లేకపోవడంతో ఇళ్ల మధ్యే నీరు నిల్వ ఉండి దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీని వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్రంగా అనారోగ్యానికి గురవుతున్నారు.

-యాదవ సంఘ కమ్యూనిటీ హాల్ నిధుల వినియోగంపై అనుమానా లు..?
గ్రామంలోని యాదవ సంఘానికి చెందిన కమ్యూనిటీ హాల్ నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడం గ్రామంలో చర్చనీయాంశమైంది. నిర్మాణం పూర్తికాక గోడలు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారాయి. ఈ పను లు ఎందుకు ఆగిపోయాయనే విషయంపై ఎలాంటి స్పష్టత లేకపోవడం తో కేటాయించిన నిధుల వినియోగంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. హాల్ చుట్టూ చెత్త చెదారం నిల్వ ఉండటంతో దోమల పెరుగుదల మరింత పెరిగి ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది.

ఇప్పటి కే సంవత్సరం క్రితం గ్రామానికి చెందిన కత్తుల రాజు కలెక్టర్ కార్యాల యంలోని గ్రీవెన్స్ సెల్‌లో ఈ సమస్యలపై ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్ప టివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కిందస్థాయి అధికారులు ప్రజల సమస్యలను పూర్తిగా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తు న్నారు. ఈ అంశం తాజాగా గురువారం పంచాయతీ రాజ్ శాఖలో ఈ సమస్య మరోసారి వెలుగులోకి వచ్చింది. అయినప్పటికీ బాధ్యులు స్పందించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. వెంటనే మట్టి దారిని సీసీ రోడ్డుగా మార్చడం, నిలిచిపోయిన కమ్యూ నిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

అన్ని గ్రామాల్లో ఇదే విధంగా నిర్లక్ష్యమా..?

ఇదిలా ఉండగా మండలంలోని ఈ ఒక్క సముద్రాల గ్రామానికే పరిమి తమా? లేక అన్ని గ్రామాల్లో ఇదే విధంగా అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం జరుగుతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ప్రజా ఆందోళనలు మరింత ఉధృతమయ్యే అవకాశ ముందని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ నిర్లక్ష్యమని గ్రామ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply