తేనెటీగల దాడిలో కానిస్టేబుల్ మృతి..

తేనెటీగల దాడిలో కానిస్టేబుల్ మృతి..

శ్రీశైలం ఆనకట్ట వద్ద సంఘటన…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు డ్యాం నిర్వాణ వద్ద విధుల్లో ఉన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి 52 తేనెటీగ ల దాడిలో మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. శ్రీశైలం డ్యాం వద్ద విధుల నిమిత్తం పెట్రోలింగ్ చేస్తుండగా తేనెటీగలు ఆయనను చుట్టుముట్టయి. తప్పించుకునే ప్రయత్నంలో గుండెపోటుకు గురై ఆందోళన చెందరు.

ఈ ఆందోళనలో వీరాస్వామి అనుకోకుండా కింద పడటం ఒకటేసారి గుండెపోటు రావడం మృతి చెందాడని పోలీసులు తెలుపుతున్నారు. తేనెటీగలు చుట్టుముట్టటంతో భయాందోళన చెంది కింద పడిపోయాడు. ఆస్పత్రి తరలించే లోపే మరణించాడు. ఈ సంఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యా అయ్యా యి. శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply