Congress Govt | కాంగ్రెస్ పార్టీతోనే అన్నివర్గాల సంక్షేమం
Congress Govt | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీతోనే అన్నివర్గాల సంక్షేమం సాధ్యమని సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలాజగ్గారెడ్డి అన్నారు. ఈ రోజు సదాశివపేట మండలం నందికంది, కోనాపుర్ గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల తరపున సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డితో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థుల(Sarpanch candidates) తరపున గడప, గడపకూ ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. నిర్మలజగ్గారెడ్డి రావడంతో కాంగ్రెస్ శ్రేణులు నందికంది గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నందికంది సర్పంచ్ అభ్యర్థి రేచర్ల స్రవంతి విజయభాస్కర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అనంతరం కోనాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి చిరంజి దశరథ్ తరపున నిర్మల జగ్గారెడ్డి ఇంటిటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఉందని, కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థిని గెలిపిస్తే నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు, సన్న బియ్యం, రైతు రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్(200 units of free electricity) లాంటి పథకాలను చూసి ప్రజలు ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సిడీసి చైర్మెన్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడీల రామ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సిద్దన్న, సదాశివ పేట మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు చిరంజీవి, పిల్లోడి విశ్వనాథ్, అమర్ నాథ్ రెడ్డి, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

