CM Chandrababu | భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో సీఎం

CM Chandrababu | భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో సీఎం
- మెగా సైన్స్, టెక్ ఎక్స్పోను ప్రారంభించిన చంద్రబాబు
CM Chandrababu | తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతిలో నిర్వహిస్తున్నభారతీయ విజ్ఞాన సమ్మేళనం (BVS) 2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. భారతీయ విజ్ఞాన సమ్మేళనం కార్యక్రమ ప్రారంభానికి ముందు మెగా సైన్స్, టెక్ ఎక్స్పో ను ఆయన ప్రారంభించారు. సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్, విజ్ఞాన్ భారతి (VIBHA) ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ సి. మండే, DRDO మాజీ ఛైర్మన్, రిసెప్షన్ కమిటీ హెడ్ – BVS 2025 డాక్టర్ జి. సతీష్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి ఎ. సత్య ప్రసాద్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ జి. ఎస్. ఆర్. కె. మూర్తి,విజ్ఞాన్ భారతి జనరల్ సెక్రటరీ, వివేకానంద పాయ్, జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్, డెలిగేట్లు, తదితరులు పాల్గొన్నారు.
