మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. కాకినాడ సీ-పోర్టు, సెజ్ కేసులో విజయసాయి రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన విజయసాయి రెడ్డి మరోసారి విచారణకు రావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది.
కాగా, ఈ కేసులో గత బుధవారం సీఐడీ అధికారులు విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. విజయవాడ సీఐడీ కార్యాలయంలో విజయసాయి రెడ్డిని 5 గంటల పాటు విచారించారు. అవసరమైతే మరోసారి రావాలని సీఐడీ అధికారులు చెప్పారు. ఈ మేరకు సీఐడీ అధికారులు విజయసాయి రెడ్డికి మళ్లీ నోటీసులు జారీ చేశారు.
కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్ అధిపతి కె.వి.రావు నుంచి అక్రమంగా షేర్లను బదిలీ చేసుకున్నారనే ఆరోపణలపై విజయసాయి రెడ్డిని మంగళగిరి సిఐడి పోలీసులు గతంలో ప్రశ్నించారు. విజయసాయిరెడ్డితో పాటు మెుత్తం ఐదుగురిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో ఏ-1 విక్రాంత్ రెడ్డి, ఏ-2 విజయసాయిరెడ్డి, ఏ-3 శరత్ చంద్రారెడ్డి, ఏ-4 శ్రీధర్, ఏ-5గా అరబిందో రియాల్టీ ఇన్‌ఫ్రా ఉన్నారు.