ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలి..

ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలి..
జన్మదిన సందర్భంగా హెల్మెట్ బహుకరణ
నూతన వరవడికి శ్రీకారం చుట్టిన సర్పంచ్ సుందర్
చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరూ గ్రామంలో ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు బాధ్యతగా హెల్మెట్ ధరించి ప్రమాదాల పారిన పడకుండా ఉండాలని గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ శుక్రవారం నాడు ప్రజలకు పిలుపునిచ్చారు నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధి చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ మాజీ వార్డ్ మెంబర్ హెచ్ స్వామి జన్మదిన సందర్భంగా ఆయనకు సర్పంచ్ సుందర్ హెల్మెట్ ఒక పూల మొక్కను అందజేసి నూతన వరవడికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దివి చక్ర వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలని పిలుపునిచ్చారు అందుకు అణంగానే గ్రామంలో ఎవరి పుట్టిన రోజు అయినా హెల్మెట్ ఒక పూల మొక్కను అందజేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని సర్పంచ్ ఆవుల సుందర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సంఘాల అధ్యక్షురాలు ఆవుల మాధవి సుందర్ సామాజిక కార్యకర్త పొలిమేర దశరథ కాంగ్రెస్ నాయకులు పొలిమేర శంకర్ ఇతర ప్రజాప్రతినిధులు తదితరు పాల్గొన్నారు
