ప్రజలకు అందమైన పార్కునందిస్తాం…

ప్రజలకు అందమైన పార్కునందిస్తాం…

రాప్తాడు, ఆంధ్రప్రభ : రాప్తాడు అయ్యవారిపల్లి ప్రజలకు అందమైన నక్షత్ర వనంను ఏర్పాటు చేసి అందిస్తామని టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి పేర్కొన్నారు.రాప్తాడు మండల పరిధిలోని అయ్యవారిపల్లి చెరువు అభివృద్ధి కోసం భూమి పూజ చేసి జెసిబితో పనులు ప్రారంభించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకం (పి.ఎం కె.ఎస్.వై) ద్వారా రూ.50 లక్షలు నిధులతో గ్రామ చెరువు అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టమన్నారు.

ఇందులో జంగిల్ క్లీనింగ్ వాకింగ్ ట్రాక్ జిమ్ మొక్కలు నాటడం చిల్డ్రన్ పార్క్ నక్షత్రం ఆకారంలో వనంను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని తెలియజేశారు. మిగతా గ్రామాలలో కూడా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ నెట్టెం వెంకటేష్ ఏడిసిసి చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ నాయుడు ఎంపీడీవో విజయలక్ష్మి తాసిల్దార్ విజయకుమారి ఏపీవో సావిత్రి డిప్యూటీ ఎంపీడీవో అశోక్ బాబు మైనర్ ఇరిగేషన్ ఏఈ కృష్ణ కుమార్ ఈసీ మురళి గ్రామ సర్పంచ్ తిరుపాలు టిడిపి నాయకుడు ఉప్పర శ్రీనివాసులు క్లస్టర్ ఇంచార్జ్ సోమర నారాయణస్వామి కాంట్రాక్టర్ బైటీని ప్రసాద్ ఫీల్డ్ అసిస్టెంట్ శివయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply