108 అంబులెన్స్ లో ప్రసవం..

అదిలాబాద్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గట్టెపల్లి చింతగూడకు చెందిన సిడం సావిత్రిబాయి (29), భర్త తులసీరామ్ అనే గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండగా 108 అంబులెన్స్‌లోనే ప్రసవం జరిగింది. ఆమెకు ఆడ శిశువు జన్మించింది.
గురువారం తెల్లవారుజామున రక్తహీనత కారణంగా మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రి సిబ్బంది ఆమెను రిమ్స్‌కు రిఫర్ చేశారు. అయితే అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా ముత్నూర్ గ్రామం సమీపంలో ఉదయం సుమారు 4 గంటల సమయంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంఎటి సంతోష్, పైలట్ రాజేష్ సాయంతో సురక్షితంగా ప్రసవం నిర్వహించారు.
ఇది ఆమెకు ఆరవ కాన్పు కాగా ఆడ శిశువు జన్మించింది. తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారని అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని రిమ్స్‌కు తరలించారు. ఈ సందర్భంగా తల్లి, శిశువు కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
