Cheques | 37 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులు…

Cheques | 37 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులు…
- మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు…
Cheques | నిజాంపేట, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలనలో ఒక కోటి 70 లక్షల కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈ రోజు ఎమ్మెల్యే రోహిత్ రావు మండలానికి సంబంధించి 37 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు 9 మందికి సీఎంఆర్ చెక్కులను అందజేశారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇందిరమ్మ రాజ్యం వచ్చినాటి నుండి మహిళలు యువకులు బాగుండాలనే ఉద్దేశంతో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తున్నామని తెలిపారు. అలాగే ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని గత పాలకులు ఒక్కో మనిషి మీద రెండు లక్షల రూపాయల అప్పు చేసి పోయిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంపేట మండలంలోని గ్రామాలను సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ గ్రామాల అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తాహసిల్దార్ రమ్యశ్రీ, ఎంపీడీవో రాజిరెడ్డి, ఆర్ఐ ప్రీతి, సర్పంచుల పోరం అధ్యక్షుడు భాను ప్రకాష్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బొమ్మన మల్లేశం,మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు,మాజీ సర్పంచ్ అమర సేనా రెడ్డి, దేమే యాదగిరి, సర్పంచులు రామచందర్ నాయక్, బాబు నాయక్, సుశీల, చల్మేటి నరేందర్, మంజుల, ఉప సర్పంచ్ రమేష్,కాంగ్రెస్ నాయకులు పంజా మహేందర్, నసీరుద్దీన్, మధుసూదన్ రెడ్డి, లక్ష్మా గౌడ్, లింగం గౌడ్, మహేష్, నాగరాజు, వినోద్ నాయక్, శ్రీనివాస్ నాయక్, సులేమాన్, తదితరులు పాల్గొన్నారు.
