Chautuppal | సమస్యల పరిష్కారం కోసం..

Chautuppal | సమస్యల పరిష్కారం కోసం..
- ఇఎల్ వీ భాస్కర్ ఫౌండేషన్ కృషి చేస్తుంది
- ఫౌండేషన్ డైరెక్టర్ అశోక్
Chautuppal | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇఎల్ వీ భాస్కర్ ఫౌండేషన్ కృషి చేస్తుందని ఇఎల్ వీ భాస్కర్ ఫౌండేషన్ డైరెక్టర్ ఇరుగదిండ్ల అశోక్ అన్నారు. చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డులో నూతనంగా నిర్మించిన మోక్ష లింగేశ్వరస్వామి శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇఎల్ వీ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేవాలయంలో భక్తుల సౌకర్యార్ధం షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అడగగానే షెడ్డు నిర్మించేందుకు ముందుకు వచ్చిన ఇఎల్ వీ ఫౌండేషన్ ను ఆలయ కమిటీ సభ్యులు అభినందిస్తూ శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ఇఎల్ వీ ఫౌండేషన్ కేవలం ఆధ్యాత్మిక రంగంలోనే కాకుండా, విద్యా, వైద్య, ఉపాధి రంగాల్లో కూడా పేదలకు అండగా ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని కోరారు.
అదేవిధంగా మున్సిపాలిటీలోని మల్లికార్జుననగర్ కాలనీలో మందుల కుల సంక్షేమ సంఘం మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరగా ఫౌండేషన్ చైర్మన్ ఇ.ఎల్.వి. భాస్కర్ ఫౌండేషన్ ఆదేశంతో ఫౌండేషన్ డైరెక్టర్ అశోక్ పూజ నిర్వహించి బోరు బావి పనులను ప్రారంభించారు.
బోరు వేయించి నీటి సమస్యను పరిష్కరించినందుకు మందుల కుల సంక్షేమ సంఘం నాయకులు, స్థానిక ప్రజలు ఇ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్ గురు స్వామి, తొర్పునూరి నరసింహ గౌడ్, మందుల కుల సంఘం ఉపాధ్యక్షులు సరికొండ సమ్మయ్య, నోముల సత్తిరెడ్డి, మార్గం శివకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
