Chandrababu | పుట్టపర్తికి చేరుకున్న సీఎం

Chandrababu | పుట్టపర్తికి చేరుకున్న సీఎం
సీఎంకు ఘనస్వాగతం
Chandrababu | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతోత్సవాల్లో పాల్గొనేందుకు శనివారం ఉదయం పుట్టపర్తి (Puttaparthi) విమానాశ్రయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చేరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా విచ్చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత, జౌలిశాఖ మంత్రి ఎస్.సవిత, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, హిందూపురం ఎంపీ బికే. పార్థసారథి, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, 13వ నెహ్రూ యువ కేంద్రం జాతీయ వైస్ చైర్మన్, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, సీసీఎల్ఏ, స్పెషల్ సిఎస్ జయలక్ష్మి, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్, డిఐజి షిమోషీ, జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.

