బాస‌ర (నిర్మ‌ల్ జిల్లా) : బాసర రైల్వేస్టేషన్ మీదుగా వెళ్లే పలు రైళ్ల ను దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం దారి మళ్లించారు. కామారెడ్డి జిల్లాలోని బిక్నుర్ – తిప్పపూర్ వద్ద పట్టాలు కొట్టుకుపోవడంతో రైల్వే అధికారులు అప్ర‌మ‌త్త‌మై రైళ్లను దారి మళ్లించారు. కాజీపేట – చర్లపల్లి – నిజామాబాదు మధ్య రైలు రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

  • 17606 భగత్ కి కోటి ( జోధ్ పూర్ ) – కాచిగూడ నుండి ప్రతి రోజూ ఎక్స్ ప్రెస్ రైలును నిజామాబాదు – పెద్దపల్లి – కాజీపేట – సికింద్రాబాద్ మార్గం గుండా దారి మ‌ళ్లించారు.
  • 17057 /58 దేవగిరి ఎక్స్ ప్రెస్ లింగంపల్లి నుండి ముంబయి, ముంబయి నుండి లింగపల్లి వరకు ఇరు మార్గాల్లో నడిచే రైలును సికింద్రాబాద్ -కాజీపేట – పెద్దపల్లి – నిజామాబాదు మార్గం లో దారి మ‌ళ్లించారు.
  • 16734 ఓఖా నుండి రామేశ్వరం వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును నిజామాబాదు – పెద్దపల్లి-కాజీపేట – కాచిగూడ మీదుగా దారి మళ్లించారు.
  • 17405 కృష్ణా ఎక్స్‌ప్రెస్ కాజీపేట టౌన్ -పెద్దపల్లి – నిజామాబాదు మీదుగా దారి మ‌ళ్లించారు.

Leave a Reply