గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
నకరికల్లు,ఆంధ్రప్రభ : మండల పరిధిలోని కండ్లకుంట గ్రామం వద్ద గల గుంటూరు బ్రాంచ్ కెనాల్‌పై గల కేసీపి 4వ నెంబర్ పవర్ ప్లాంట్ వద్ద సుమారు 30 నుంచి 35 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తుతెలియని మగ వ్యక్తి శవం కొట్టుకురాగా సమాచారం అందుకున్న నకరికల్లు ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి పంచనామా నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతుడు లైట్ గ్రీన్ కలర్ షార్ట్ సిమెంట్ కలర్ టీషర్ట్ ధరించి ఉన్నాడని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన వారు 9440796246 లేదా 9966460427 నెంబర్లను సంప్రదించాలని ఎస్సై సతీష్ కోరారు కోరారు
