BJP | రైతు భరోసా విడుదల చేయాలి …

BJP | రైతు భరోసా విడుదల చేయాలి …

  • బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు బంగారు మహేష్ …

BJP |బచ్చన్నపేట, ఆంధ్రప్రభ : వరంగల్ సభలో సీఎం ప్రకటించిన రైతు డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని బచ్చన్నపేట బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు బంగారు మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రైతు భరోసా పథకం ప్రవేశపెట్టినప్పటికీ, అమలులో చిత్తశుద్ధి కనపరచడం లేదని అన్నారు. ఎన్నికలప్పుడు వేయడం ఎన్నికలు అయిపోయాక భరోసా ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. యాసంగి వరి నాట్లు వేసి నెల 15 రోజులు గడిచినప్పటికీ రైతుల అకౌంట్ల‌లో రైతు భరోసా డబ్బులు వేయకపోవడం రైతులను మోసం చేయడమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా సర్పంచుల ఖాతాలలో వేస్తున్న నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తప్ప రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గారంటీల అమలు పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు…

Leave a Reply