Bichkunda | అయ్యప్ప స్వాముల శ్రమదానం…

Bichkunda | బిచ్కుంద, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పుల్కల్ సర్వేశ్వర మందిర అయ్యప్ప స్వాములు సన్నిధాన నిర్మాణం కోసం శ్రమదానం చేస్తున్నారు. సన్నిధానం పైకప్పులో ఫ్లోరింగ్ గ్రామస్తుల సహకారంతో శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో శంకర్ గురుస్వామి, అనిల్ గురుస్వామి, గదా స్వాములు దత్తాత్రి స్వామి, కొట్టం విజయ స్వామి, గంగాధర్ స్వామి, కత్తి స్వామి గంగుస్వామి, వెంకట్ రెడ్డి స్వామి, ఆకుల మారుతి స్వామి, గణపతి స్వామి ఈ శ్రమదానంలో పాల్గొన్నారు.
