bhupalapally | మొదటి రౌండ్ లెక్కింపు షురూ

bhupalapally | మొదటి రౌండ్ లెక్కింపు షురూ
ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ 30 వార్డులకు శుక్రవారం ఉదయం 8.30 గంటల నుండి లెక్కింపు షురూ అయింది. 34,367 ఓట్లను 10 చొప్పున టేబుల్స్ లో మూడు రౌండ్లలో లెక్కించనున్నారు. మొదటి రౌండ్లో 1వ వార్డు , 4వ వార్డు , 7వ వార్డు , 10వ వార్డు , 13వ వార్డు , 16వ వార్డు , 19వ వార్డు ,22వ వార్డు , 25 వ వార్డు , 28వ వార్డు ల ఓట్లను 10 టేబుల్స్ లో లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లు 2వ,6వ,9వ, 16వ,23వ,27వ వార్డుల్లో ఒక్కొక్కటి నమోదు అయ్యాయి.
