భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా ఎంపికైన భూక్య సంగీత

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా డోర్నకల్ నియోజకవర్గ ఇంచార్జీ నర్సింహులపేట మండలం గ్యామతండా గ్రామ పంచాయతీకి చెందిన భూక్యా సంగీత ఎంపికైనట్లు సోమవారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు ప్రకటించిన జాబితాలో తన పేరును ఖరారు చేసి బాధ్యతలు అప్పజెప్పినట్లు భూక్య సంగీత మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తన పేరును ప్రతిపాదించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
