రెండో అంతస్తు నుంచి జారిపడి బేల్దారి మృతి..

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రెండో అంతస్తు నుంచి కిందికి జారిపడి బేల్దారి మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లాలోని ఆమిద్యాల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన మృతుని బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉరవకొండ పట్టణానికి చెందిన సలీం అనే యువకుడు ఆమిద్యాల గ్రామంలో ఇంటి నిర్మాణ పనులలో భాగంగా పై కప్పుపై నీటితో క్యూరింగ్ చేస్తుండగా, సలీం ప్రమాదవశాత్తు రెండో అంతస్తు నుంచి కిందకి జారిపడ్డాడు. తీవ్ర గాయాలైన సలీంను స్థానికులు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply