BC unions’ protest | ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపు (బుధవారం) ఢిల్లీలో జరిగే బీసీ సంఘాల నిరసనలో ఆయన పాల్గొంటారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఆమోదం తెలిపేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోంది.

విద్య, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులకు ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో ఆమోదింపజేసుకున్న విషయం తెలిసిందే.

అయితే, ఆ బిల్లులను పార్లమెంట్‌ లో ఆమోదించి, షెడ్యూల్-9 లో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో రేపు ఢిల్లీ లోని జంతర్‌మంతర్ వద్ద 12 బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే రేపు సీఎం రేవంత్ తో పాటు ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు ఢిల్లీకి ప‌య‌న‌మ‌య్యారు. బీసీ సంఘాల ధర్నాకి రాహుల్ గాంధీ కూడా రానున్నారు.

ఇక అటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, వాకిటి శ్రీహరి, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రకాశ్ గౌడ్, ఈర్లపల్లి శంకరయ్య ఢిల్లీ బయలుదేరారు. రేపు ఢిల్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో చేసిన చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించాలని ధర్నా చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *