LSG vs PBKS | ఐదోవ‌ర్ల‌కే మూడు వికెట్లు కోల్పోయిన ల‌క్నో

  • ఎల్‌ఎస్‌జి బ్యాట‌ర్ల‌పై ఒత్తిడి పెంచుతున్న పంజాబ్ !

ల‌క్నో : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈరోజు లక్నో, పంజాబ్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. ల‌క్నో ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. అయితే, ల‌క్నో సూపర్ జెయింట్స్ కు ఆదిలోనే నుంచే షాక్ తగిలింది.

తొలి ఐదు ఓవర్లలోనే కీలకమైన వికెట్లు కోల్పోయి లక్నో క‌ష్టాల్లో ప‌డింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (0) డ‌కౌట్ కాగా.. మార్క్రమ్ (28), కెప్టెన్ రిషబ్ పంత్ (2) పరుగులకే ఔటయ్యారు.

దీంతో ఐదోవ‌ర్ల‌కు 36 ప‌రుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది ల‌క్నో సూప‌ర్ జేయింట్స్. ప్రస్తుతం క్రీజులో ఆయుష్ బ‌దోనీ, నికోలస్ పూరన్ ఉన్నారు.

Leave a Reply