మద్యం టెండర్లకు బంద్ ఎఫెక్ట్

బ్యాంకులు బంద్ కావడంతో టెండర్లు వేయలేకపోతున్న ఆశావ‌హులు


నల్గొండ అక్టోబర్ 18(ఆంధ్ర ప్రభ ): మద్యం టెండర్లకు బీసీ బంద్ (BC Bandh) ఎఫెక్ట్ పడింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ శనివారం నిర్వహించిన బీసీ బంద్ జిల్లాలోని వివిధ బ్యాంకులు బంద్ కావడంతో ఆశాజీవులు టెండర్లు వేయలేకపోతున్నారు. డీడీలు చెల్లించలేని పరిస్థితిలో ఎక్సైజ్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.

టెండర్లకు చివరి గడువు కావడంతో ఐదు గంటల లోపే టెండర్లు (tenders) సమర్పించాల్సి ఉంటుంది. గత ఏడాదిలో 154 మద్యం దుకాణాలకు 7000 పైచిలుకు ద‌ర‌ఖాస్తులు రావడంతో ఈసారి ప్రభుత్వం మూడు లక్షల రుసుము విధించింది. జిల్లాలోని 154 మద్యం దుకాణాలకు శుక్రవారం వరకు 2,439 మాత్రమే టెండర్లు దాఖలు అయినట్లు ఎక్సైజ్ అధికారులు (Excise Officers) తెలిపారు. ఈసారి గతానికంటే సగం కూడా టెండర్లు దాకాలు కావని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీసీ బంద్ ఎఫెక్ట్తో టెండర్ల గడువు పెంచాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Leave a Reply