Balkonda | నేడు గోదాదేవి -రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవం

Balkonda | నేడు గోదాదేవి -రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవం
- ఏర్పాట్లను పూర్తి చేసిన ఆలయ, గ్రామాభివృద్ధి కమిటి సభ్యులు
Balkonda | బాల్కొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని జలాల్ పూర్ శివారులో గల శ్రీ రంగనాథ స్వామి ఆలయం వద్ద గోదాదేవి – శ్రీ రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవానికి ఆలయం సర్వాంగ సుందరంగాముస్తాబైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు నిర్వహించే కళ్యాణ మహోత్సవానికి ఆలయ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు ద్యాగ నర్సారెడ్డి ‘ఆంధ్రప్రభ’ కు తెలిపారు.

మండలంలోని ప్రజలు హాజరై కల్యాణాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనునున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వారు తెలిపారు.
