అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో… 244 పరుగుల భారీ లక్ష్యంతో ఛేజింగ్ కు దిగిన గుజరాత్ టైటన్స్ రెండో వికెట్ కోల్పోయింది. పవన హిట్టింగ్ తో చెలరేగి ఆడుతున్న యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్.. 12.3 వ ఓవర్లో అర్శదీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు.
ఓపెనర్‌గా బరిలోకి దిగిన సాయి సుదర్శన్ (41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 74) అర్ధ సెంచరీ బాది… మెరుపు వేగంతో సెంచరీ దిశగా దూసుకెళ్తుండగా క్యాచ్ అవుట్ అయ్యాడు.
కాగా, ప్రస్తుతం క్రీజులో జాస్ బట్లర్ (38) – ఇంపాక్ట్ ప్లేయర్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ క్రీజులో ఉన్నారు.