గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా బాగారెడ్డి..

గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా బాగారెడ్డి..
బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకాగ్రీవంగా ఏర్పాటు చేసినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం గ్రామ కమిటీని ఏకాగ్రీవంగా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఇటిక్యాల బాగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వడ్ల బ్రహ్మనందం, కార్యవర్గ సభ్యులు బొంది గణేష్, ఏర్వ ధనరాజ్ బండి వెంకటస్వామి గౌడ్ , పాపోళ్ల అశోక్ లను ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టెంట్ హౌస్ స్వామి, మాజీ సొసైటీ అధ్యక్షులు బాలగోని రాజా గౌడ్, ఉప సర్పంచ్ పట్లూరి చైతన్య కొండల్ రెడ్డి, వార్డు సభ్యులు వడ్ల శ్రీనివాస్, బుడ్డ సత్తయ్య, గిజివెల్లి మాధవరెడ్డి, కంటి నర్సింలు, నట్ట లింగం, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
