కడెంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా నిర్వహణ

కడెం, ఆంధ్రప్రభ : భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు మరువలేనివని పెద్దూర్–కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ అన్నారు. మండల కేంద్రమైన కడెంలోని పెద్దూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిట్టల రాజన్న, జీపీ కార్యదర్శి ఎండీ మునవర్ ఉల్ హసన్, కడెం రామాలయం కమిటీ అధ్యక్షుడు గడప దేవరాజ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, వివిధ దళిత సంఘాల నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
