Ayyappa Swamy | వైభవంగా అయ్యప్ప అరట్టు..

Ayyappa Swamy | వైభవంగా అయ్యప్ప అరట్టు..

Ayyappa Swamy, మెండోర, ఆంధ్రప్రభ : నిజామాబాద్ (Nizamabad) జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మెండోర మండల కేంద్రంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో సోమవారం అయ్యప్ప అరట్టు (Ayyappa Arattu) మహాత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ మేరకు అయ్యప్ప స్వాముల బృందం, ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవ ఏర్పాట్లను పూర్తి చేశారు. తిరునాళ్లలో భాగంగా, ఉదయం 7:00 గంటలకు మహిళా భక్తులు ప్రత్యేకంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహించి, స్వామివారిని వెంకటేశ్వర ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకుని రానున్నారు.

ఉదయం 9 గంటలకు స్వామివారి అభిషేకం, చాక్రశాల జరుగుతోందని ఈ ఘట్టానికి అధిక సంఖ్యలో మహిళా భక్తులు హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. అనంతరం ఉదయం 11:00 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అయ్యప్ప స్వాములు తెలిపారు. ఈ మహాత్సవాన్ని గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ అభివృధి కమిటీ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని అయ్యప్ప స్వాములు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply