Assembly Elections | ఢిల్లీలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు
ఓటు హక్కు వినియోగించుకోనున్న 1.56 కోట్ల మంది ప్రజలు
5 గంటల సమయానికి 56 శాతం పోలింగ్
ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ సక్సేనా
అరవింద్ కేజ్రీవాల్, అదితి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ
మనిష్ సిసోనిడియా, పలువురు కేంద్ర మంత్రులు తొలి గంటలోనే ఓటింగ్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తొలి గంటల్లోనే పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. . ఈ ఎన్నికల ఫలితాలను ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు. సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. కాగా నేటి మధ్యాహ్నం 5 గంటల వరకు 56 శాతం ఓటింగ్ నమోదైంది..
ఇది ఇలా ఉంటే ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదే సమయంలో, ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. ఇందుకు గానూ 13 వేల 766 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇక ఢిల్లీలో 58 జనరల్, 12 ఎస్సీ రిజర్వ్ సీట్లు ఉన్నాయి. 83.49 లక్షల మంది పురుషులు.. 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక 20 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న యువ ఓటర్ల సంఖ్య 25.89 లక్షలు కాగా ఇక 2.08 లక్షల మంది ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్నారు. వికలాంగులు 79,430 మంది ఓటర్లు ఉండగా.. 100 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 830.. 85 ఏళ్ల వయసు దాటిన ఓటర్ల సంఖ్య 1.09 లక్షలుగా ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలో ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్య 1261 ఉన్నారు .
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ప్రెసిడెంట్ ఎస్టేట్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ముర్ము ఓటేశారు. ఇక కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్మాణ్ భవన్లో ఓటు వేశారు.కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్, ఆయన సతీమణి తుగ్లక్ క్రెసెంట్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఆయన సతీమణి లక్ష్మీ పురి, ఇతర కుటుంబసభ్యులు ఆనంద్ నికేతన్లో ఓటు వేశారు. దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె, బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ జన్పథ్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ తన సతీమణితో కలిసి కె.కమ్రాజ్ లేన్లో ఓటు వేశారు. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ, ఢిల్లీ సిఎం అదితి, అప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ , కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్, ఆప్ సీనియర్ నేత మనిష్ సిసోడియాలు కూడా ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు..
ఇప్పటి వరకు ఓటేసిన ప్రముఖులు..
రాష్ట్రపతి ఎస్టేట్‌లో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము
కె.కమ్రాజ్ లేన్ లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠీ
రాజ్ నివాస్ మార్గ్ లో ఢిల్లీ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా
కల్కాజీలో ఢిల్లీ సీఎం అతిశీ
నిర్మాణ్ భవన్ లో సోనియా గాంధీ
నిర్మాణ్ భవన్ లో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
తుగ్లక్ క్రెసెంట్ లో విదేశాంగ మంత్రి జైశంకర్, ఆయన అర్ధాంగి
ఆనంద్ నికేతన్ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కుటుంబం
జన్ పథ్ లో బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్
న్యూఢిల్లీ నియోజకవర్గంలో మనీశ్ సిసోడియా దంపతులు
న్యూఢిల్లీ – అరవింద్ కేజ్రీవాల్ ఫ్యామిలీ
ఇది ఇలా ఉంటే , అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. మరోసారి అధికారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తుండగా.. ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ఆరాటపడుతోంది. అలాగే కాంగ్రెస్ కూడా గట్టిగానే ప్రచారం నిర్వహించింది. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ ఉచిత పథకాలను ప్రకటించాయి. ఎవరికి వారే పోటాపోటీగా హామీలు గుప్పించారు. కానీ హస్తిన వాసులు ఎవరికీ అధికారం కట్టబెడతారో చూడాలి. ఇక ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలో దిగారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక స్థానాలు
న్యూఢిల్లీ నియోజకవర్గంఆప్ – అరవింద్ కేజ్రీవాల్ , బిజేపీ – పర్వేష్ వర్మ, కాంగ్రెస్ – సందీప్ దీక్షిత్
కల్కాజీ నియోజకవర్గం ఆప్ – అతిషీ, బీజేపీ- రమేష్ బిధూరీ, కాంగ్రెస్ – అల్కా లంబా
జంగ్‌పురా నియోజకవర్గం ఆప్ – మనీష్ సిసోడియా . బీజేపీ – సర్దార్ తర్వీందర్ సింగ్ మార్వా, కాంగ్రెస్ – ఫర్హాద్ సురి
ప్రతాప్‌గంజ్ నియోజకవర్గం ఆప్ – అవధ్ ఓజా,. బీజేపీ – రవిందర్ సింగ్ నేగి, కాంగ్రెస్ – అనిల్ చౌదరీ
మాలవ్యా నగర్ నియోజకవర్గం సోమనాథ్ భారతీ (ఆప్), సతీష్ ఉపాధ్యాయ( బీజేపీ), జితేందర్ కుమార్ కోచర్ (కాంగ్రెస్)
ఛత్తార్‌పూర్ నియోజకవర్గంబ్రహ్మ సింగ్ తన్వార్ (ఆప్), ఖర్తార్ సింగ్ తన్వార్ (బీజేపీ),రాజేందర్ సింగ్ తన్వార్ (కాంగ్రెస్).
బల్లిమరాన్ అసెంబ్లీ నియోజకవర్గం ఇమ్రాన్ హుస్సేన్ (ఆప్), హరూన్ యూసఫ్ (కాంగ్రెస్), కమల్ బగ్రీ (బీజేపీ).
ఓక్లా అసెంబ్లీ నియోజకవర్గం అమనతుల్లా ఖాన్ (ఆప్), బ్రహ్మం సింగ్ (బీజేపీ), అరిబ్ ఖాన్( కాంగ్రెస్)
షాకుర్ బస్తీ అసెంబ్లీ నియోజకవర్గంసత్యందర్ జైన్ (ఆప్), కరైన్ సింగ్(బీజేపీ), సతీష్ లూథ్రా (కాంగ్రెస్,
)రోహిణి అసెంబ్లీ నియోజకవర్గం ప్రదీప్ మిట్టల్ (ఆప్) ,సుమేష్ గుప్తా (కాంగ్రెస్),విజేందర్ గుప్తా (బీజేపీ)