Asis Mega Bush fires :   ఆగదు..ఈ  కార్చిచ్చు Andhra Prabha News

Asis Mega Bush fires :   ఆగదు..ఈ  కార్చిచ్చు Andhra Prabha News

అలుపెరగని ఫైర్ ఫైటర్స్

70 విమానాలతో పోరాటం

ఆస్ట్రేలియా ఆందోళన

ఎమర్జెన్సీలో  విక్టోరియా

30 ప్రాంతాల్లో అగ్నికీలలు

లెక్కలేనన్ని మూగజీవులు ఆహుతి

  సహాయ చర్యల్లో అధికారులు బిజీబిజీ

( ఆంధ్రప్రభ, న్యూస్​ నెట్​ వర్క్)​

Asis Mega Bush fires

2026 నూతన సంవత్సర వేడుకలు ముగిసిన కొన్ని రోజుల్లోనే.. పకృతి ప్రకోపం తారా స్థాయికి చేరింది. ఇటు ఆస్ట్రేలియాలో కార్చిచ్చుతో.. విక్టోరియా దహనం సాగుతుంటే.. అటు అమెరికాలో హిమపాతం జన సమాధికి సిద్ధమైంది. జనవరి మొదటి వారం నుంచి ఆస్ట్రేలియాలోని  విక్టోరియా రాష్ట్రంలో  భీకరమైన కార్చిచ్చు (Bushfires) కొనసాగుతోంది.

Asis Mega Bush fires

 ముఖ్యంగా లాంగ్‌వుడ్ (Longwood), హార్‌కోర్ట్ (Harcourt),   వాల్వా (Walwa) ప్రాంతాల్లో  అంతులేని అగ్నికీలలు  వ్యాపిస్తున్నాయి. 30  ప్రాంతాల్లో ఈ కార్చిచ్చు విస్తరిచింది.  3,50,000 హెక్టార్లకు పైగా అడవులు   వ్యవసాయ భూములు బుగ్గి బుగ్గి అయ్యాయి.  

Asis Mega Bush fires

 30 ప్రాంతాల్లో  మంటలు (Fires)  అదుపులోకి రావటం లేదు. అందులో 10 అత్యంత ప్రమాదకరంగా మారాయి. ఈ కార్చిచ్చు తీవ్రత దృష్ట్యా 18   ప్రాంతాల్లో “స్టేట్ ఆఫ్ డిజాస్టర్” (విపత్తు స్థితి)  విక్టోరియా ప్రీమియర్ జసింతా అలన్ ప్రకటించారు.  

Asis Mega Bush fires   : జనం అష్టకష్టాలు

 లాంగ్‌వుడ్ ప్రాంతంలో ఒక వ్యక్తి మరణించాడు. సుమారు 350 పైగా కట్టడాలు (ఇళ్లు, వ్యాపార సంస్థలు, షెడ్లు) పూర్తిగా కాలిపోయాయి. భారీ సంఖ్యలో అడవిలోని  వన్యప్రాణులు, వ్యవసాయ క్షేత్రాల్లోని  పశువులు మరణించాయి. ఇప్పటి వరకూ ఈ కార్చిచ్చుకు ఆహుతైన మూగ జీవుల సంఖ్య తేలలేదు.

Asis Mega Bush fires

సుమారు 400 కిలోమీటర్ల విస్తర్ణీర్ణంలో దట్టమైన పొగ విస్తరించింది. ఊపిరి సలనని స్థితి నెలకొంది. మెల్‌బోర్న్ తదితర  నగరాల్లో పొగ కారణంగా గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది.  ప్రస్తుతం లాంగ్‌వుడ్ (Longwood)లో  400 కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. ఇది ప్రస్తుతం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది.

Asis Mega Bush fires

ఈశాన్య విక్టోరియాలోని  న్యూ సౌత్ వేల్స్ సరిహద్దుల వైపు .  వాల్వా (Walwa) ,  మౌంట్ లాసన్ ప్రాంతాల్లో  విస్తరిస్తున్నాయి. బెండిగో సమీపంలోని హార్‌కోర్ట్ (Harcourt)  ప్రాంతంలో దాదాపు 47 ఇళ్లు ఇప్పటికే కాలిపోయాయి. దక్షిణ విక్టోరియాలోని ఓట్వేస్ (Otways), కెన్నెడీ క్రీక్ ,  కార్లిస్లే రివర్ ప్రాంతాల్లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. వైపర్‌ఫెల్డ్ నేషనల్ పార్క్, స్నోవీ కాంప్లెక్స్ (ఆర్బోస్ట్ పరిసరాల్లో) కూడా మంటలు  నసాగుతున్నాయి.  హార్‌కోర్ట్   ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు  తాగునీటి ఎద్దడి దెబ్బతినడంతో  నల్లా నీరు తాగడానికి వీలులేదని అధికారులు హెచ్చరించారు.

Asis Mega Bush fires

35,000  ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ పొగ కారణంగా మెల్‌బోర్న్ సహా అనేక నగరాల్లో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. శ్వాసకోశ సమస్యలతో జనం సతమతమవుతున్నారు. ప్రస్తుతం  సహాయక కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. సుమారు 1,000కి పైగా వ్యవసాయ క్షేత్రాలు దెబ్బతిన్నాయి.

Asis Mega Bush fires  : అలుపెరగని ఫైర్ ఫైటర్స్  

Asis Mega Bush fires

 దాదాపు 15,000 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది , వాలంటీర్లు అహర్నిశలు శ్రమిస్తున్నారు.  ఇతరుల ఇళ్లను కాపాడుతున్న క్రమంలో కొంతమంది ఫైర్ ఫైటర్లు తమ సొంత ఇళ్లను కూడా విషాదకర ఘటనలు నమోదయ్యాయి.  40 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రత, వేగంగా దిశ మార్చుకునే గాలులు (Erratic winds), దట్టమైన అటవీ ప్రాంతాలు పనిని మరింత కష్టతరం చేస్తున్నాయి. 70కి పైగా విమానాలు ఆకాశం నుండి నీటిని చల్లుతూ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి.

Asis Mega Bush fires  : బాధితులకు సర్కారు అండ

Asis Mega Bush fires

 ఫెడరల్ ,  రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి $19.5 మిలియన్ల అత్యవసర ప్యాకేజీని ప్రకటించాయి. బాధిత కుటుంబాలకు గరిష్టంగా $52,250 వరకు పునరావాస సాయం ప్రకటించారు. తక్షణ ఖర్చుల కోసం ఒక్కో వ్యక్తికి  $ 680 సాయం అందిస్తున్నారు.  మంటలు పూర్తిగా అదుపులోకి రావడానికి మరో కొన్ని వారాల సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Asis Mega Bush fires

ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గినప్పటికీ, వర్షాలు లేకపోవడం వల్ల పరిస్థితి క్లిష్టంగానే ఉంది.  ప్రభుత్వం ప్రస్తుతం 18 ప్రాంతాల్లో State of Disaster ప్రకటించి తదుపరి సహాయక చర్యలను వేగవంతం చేస్తోంది. వాతావరణం కొద్దిగా చల్లబడినప్పటికీ, మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

ALSO READ : War Terrorism :   అమెరికాలో వణకు  Andhra Prabha SPL Story

Leave a Reply