Argument | గ్రామస్తులకు పోలీసులకు మధ్య ఘర్షణ

Argument | గ్రామస్తులకు పోలీసులకు మధ్య ఘర్షణ
- కానిస్టేబుల్‌కు గాయాలు..
Argument | నేరడిగొండ, ఆంధ్రప్రభ : మండలంలోనీ చిన్న బుగ్గారం గ్రామంలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల(Election)లో నిలబడి ఓడిపోవడంతో నాకు ఓటు వేయలేదనే అక్కసుతో గ్రామంలోని వ్యక్తి రోడ్డు పై నుండి ఎవరు వెళ్లకుండా రోడ్డు(Road)పై ఏడ్ల బండి పెట్టడంతో పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసు సిబ్బందితో ఎస్ఐ ఇమ్రాన్ ఖాన్(SI Imran Khan) సర్ది చెప్పడానికి అక్కడికి వెళ్ళగా అక్కడ గ్రామస్తులకు పోలీసులకు మధ్య వాగ్వాదం(Argument) చోటు చేసుకోవడంతో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయని తెలిపారు.

