AP | ఆదుకోండి.. సారూ!

AP | ఆదుకోండి.. సారూ!
- రైస్ మిల్లుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
- కలెక్టరేట్ వద్ద కొత్త మాజేరు గ్రామస్తుల ఆందోళన
AP | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : చల్లపల్లి మండలం కొత్త మాజేరు గ్రామస్తులు ఈ రోజు కలెక్టరేట్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఎన్టీఆర్ కాలనీలోని మహాలక్ష్మి రైస్ మిల్లు నుంచి వెలువడే దుమ్ము, ధూళి వల్ల అనారోగ్యం చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లు నుంచి వెలువడే ధూళితో ఇటీవల ఇద్దరు మృతి చెందారని, మరో ముగ్గురు అనారోగ్యం పాలయ్యారని తెలిపారు. గతంలో మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆందోళనకారులు తెలిపారు.
