“స్వచ్ఛ రథం” వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

“స్వచ్ఛ రథం” వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
పమిడిముక్కల, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు విజనరితో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన “స్వచ్ఛ రథం” వాహనాన్ని పమిడిముక్కల మండల పరిషత్ కార్యాలయం వద్ద పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. ఈ వాహనాన్ని ప్రజలందరు రీసైకిల్ చేయగల ప్లాస్టిక్, ఐరన్ మొదలగు వస్తువులను ఇచ్చి నిత్యావసర సరుకులు పొందగలరని ఎమ్మెల్యే తెలియజేసారు. ప్రజలందరు ఈ “స్వచ్ఛ రధాన్ని” ఉపయోగించుకొని పర్యారణ పరిరక్షణలో భాగస్వాములు కాగలరని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, గ్రామప్రజలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
