దేవస్థానములో స్వచ్చాంద్ర ప్రతిజ్ఞ..

దేవస్థానములో స్వచ్చాంద్ర ప్రతిజ్ఞ..
మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానములో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు “స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపర్డెంట్ అచ్యుత మధుసూదన్ రావు గారు ఆలయ సిబ్బందికి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించి, శుభ్రత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ పట్ల అందరూ కట్టుబడి ఉండాలని, స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించబడింది. సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు.
