పెద్ద మల్లారెడ్డిలో ఆంజనేయస్వామి ఊరేగింపు…

బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ఆంజనేయ స్వామి శోభాయాత్ర గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ మాల ధరించిన స్వాముల ఆధ్వర్యంలో స్వామివారి శోభాయాత్ర కొనసాగింది.
గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మాల ధరించిన స్వాములు భక్తి గీతాలు ఆలపిస్తూ శోభాయాత్రను కొనసాగించారు. గ్రామస్తులు ఆంజనేయ స్వామి శోభాయాత్రను కనులారా తిలకించారు. అంజన్న స్వామి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని ఈ సందర్భంగా హనుమాన్ స్వాములు ఆకాంక్షించారు.
