america-iran-talks-break-middle-east-oil-crisis I 2605I అమెరికా-ఇరాన్ శాంతి చర్చలకు బ్రేక్

america-iran-talks-break-middle-east-oil-crisis I 2605I అమెరికా-ఇరాన్ శాంతి చర్చలకు బ్రేక్
america-iran-talks-break-middle-east-oil-crisis I 2605I ప్రతీకార చర్యలకు సిద్ధమైన ఇరాన్
ఇరాన్ సుప్రీం నేత అమెరికాకు వార్నింగ్
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు
ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ఆందోళన
america-iran-talks-break-middle-east-oil-crisis ఆంధ్రప్రభ వెబ్, అంతర్జాతీయం : ప్రపంచ దేశాల ఆశలు తలకిందులయ్యాయి. ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధం ఆగదు అనేది తేలీపోయింది. నిన్నటి వరకు శాంతి బాట ప్రయాణించాలనుకున్న అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒక్కసారిగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుతో మళ్లీ పశ్చిమాసియాలో భయాందోళన నెలకొంది. ఇరాన్‌పై అమెరికా విరుచుకుపడింది. విచక్షణ రహితంగా దాడులకు పాల్పడింది. స్వీయ రక్షణ కోసం చేపట్టిన దాడులుగా పేర్కొంది. ఇరాన్ బలగాల నుండి అమెరికా సైనికులకు ఉన్న ముప్పును నివారించేందుకు ఈ చర్యలు తీసుకున్నామని అమెరికా వెల్లడించింది. ఇరాన్ ఈ దాడులకు ప్రతీకార దాడులకు సిద్ధపడింది. అమెరికా కు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ ను కూల్చివేసినట్లు ఇరాన్ వెల్లడించింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా ఆర్‌క్యూ-4 డ్రోన్, F-35 యుద్ధ విమానంపై కూడా కాల్పులు జరిపినట్లు తెలిపింది. ఇరు దేశాల మధ్య యుద్ధానికి సిద్ధపడినట్లు సంకేతాలు ఇచ్చాయి.
america-iran-talks-break-middle-east-oil-crisis వణుకుతున్న పశ్చిమాసియా దేశాలు
అమెరికా, ఇరాన్‌పై దాడి చేయడంతో పశ్చిమాసియా దేశాలు వణుకుతున్నాయి. ఊహించని విధంగా ఈ రోజు అమెరికా ఇరాన్‌పై విరుచుకుపడింది. దీనికి ప్రతీకార దాడులు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా ఏయిర్ బేస్ ఉన్న పశ్చిమాసియా దేశాలపై దాడులు తప్పవన్నారు. పశ్చిమాసియా దేశాల్లో ఎక్కడా అమెరికాకు సురక్షిత ప్రదేశం లేకుండా చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
america-iran-talks-break-middle-east-oil-crisis శాంతి ఒప్పంద చర్చలపై ప్రభావం
చర్చలు పురోగతి సాధిస్తున్న సమయంలో ఈ దాడులు అమెరికా- ఇరాన్ మధ్య సంభవించే శాంతి ఒప్పందంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అనేది స్పష్టత లేదు. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఖాయి మాట్లాడుతూ యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చల్లో కొంత పురోగతి సాధించినప్పటికీ, ఒప్పందం వెంటనే కుదిరే పరిస్థితి లేదని చెప్పారు. భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో మాట్లాడుతూ, ఒప్పందం కుదిరే అవకాశాలు ఇంకా ఉన్నాయని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని సాధించాలని కోరుకుంటున్నారని కూడా ఆయన తెలిపారు. ఆయన మంచి ఒప్పందం కుదుర్చుకుంటారు అని రూబియో ఆశభావం వ్యక్తం చేశారు.
america-iran-talks-break-middle-east-oil-crisis అది ప్రపంచానికి అనుకూలం కాదు!
ఇరాన్‌పై అమెరికా దాడులను రూబియో ప్రస్తావిస్తూ హోర్ముజ్ జలసంధి తెరిచి ఉండాలని, అది ఒక విధంగా గానీ, మరొక విధంగా గానీ తెరిచే ఉంటుందని అన్నారు. అక్కడ జరుగుతున్నది చట్టవిరుద్ధం, అస్థిరం, ప్రపంచానికి అనుకూలం కాదని స్పష్టం చేశారు.
america-iran-talks-break-middle-east-oil-crisis అబ్బాస్ ప్రాంతాన్ని లక్ష్యంగా దాడులు
అమెరికా దాడులు దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ఇది ఇరాన్ నౌకాదళ స్థావరం ఉన్న ముఖ్యమైన పోర్ట్ నగరం. హోర్ముజ్ జలసంధికి సమీపంలో ఉంది. బందర్ అబ్బాస్ ప్రాంతంలో పేలుళ్లు వినిపించడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారని ఇరాన్ ప్రకటించింది. మే నెల ప్రారంభంలో హోర్ముజ్ జలసంధిలో అమెరికా, ఇరాన్ నౌకాదళాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. అయినప్పటికీ కాల్పుల విరమణ కొనసాగుతోందని ట్రంప్ అప్పట్లో పేర్కొన్నారు. గత వారాంతంలో ట్రంప్ రెండు పక్షాలు ఒప్పందానికి దగ్గరగా వచ్చాయని సూచించారు. కానీ తరువాత చర్చలకు త్వరపడవద్దు అని ఆదేశించినట్లు తెలిసింది.
america-iran-talks-break-middle-east-oil-crisis ఇదీ ఇరాన్ మాట
ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఖాయి మాట్లాడుతూ చర్చల్లో ఉన్న అనేక అంశాలపై తాము ఒక నిర్ణయానికి వచ్చామని, కానీ ఒప్పందం వెంటనే కుదిరిపోతుందని ఎవరూ చెప్పలేరని అన్నారు. చర్చల్లో ఉన్న అవగాహన ఒప్పందంలో 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, అలాగే ఇరాన్ అణు కార్యక్రమంపై మరిన్ని చర్చలు జరపాల్సి ఉంటుందని అన్నారు.
america-iran-talks-break-middle-east-oil-crisis అమెరికా మాట
అమెరికా-ఇరాన్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న చర్చలు తక్షణ తుది ఒప్పందానికి దారి తీసే అవకాశాలు తక్కువ. ఇరాన్‌పై ఆంక్షల సడలింపు, ఫ్రీజ్ చేసిన నిధుల విడుదల, ఇరాన్ అణు కార్యక్రమాన్ని పరిమితం చేయాలన్న అమెరికా డిమాండ్లు వంటి వివాదాస్పద అంశాలు. అవి తరువాత చర్చించే అవకాశం ఉంది. యుద్ధం ప్రారంభ సమయానికి ఇరాన్ వద్ద సుమారు 440 కిలోల యురేనియం 60% శుద్ధి స్థాయిలో ఉన్నట్లు అమెరికా భావిస్తున్నది. ఇది మరింత శుద్ధి చేస్తే అణు ఆయుధ స్థాయి 90% వరకు చేరే అవకాశం ఉంది. ఆ శుద్ధి చేసిన యురేనియంను తక్షణమే అమెరికాకు అప్పగించాలనీ, లేదా ఇరాన్ సహకారంతో అక్కడికక్కడే ధ్వంసం చేయాలని అమెరికా స్పష్టం చేసింది.

america-iran-talks-break-middle-east-oil-crisis అమెరికా ఎంక్యూ-9 కూల్చివేసిన ఇరాన్
అమెరికా కు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ ను కూల్చివేసినట్లు ఇరాన్ వెల్లడించింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా ఆర్‌క్యూ-4 డ్రోన్, F-35 యుద్ధ విమానంపై కూడా కాల్పులు జరిపినట్లు తెలిపింది. టెహ్రాన్ లోని పలు ప్రాంతాలపై అమెరికా తీవ్రమైన దాడులు చేసిన నేపథ్యంలో ఈ తరహాలో తిప్పికొట్టినట్లు పేర్కొన్నది. అమెరికా చేసే ఏ కాల్పుల విరమణ ఉల్లంఘనకైనా ప్రతీకారం తీర్చుకునే చట్టబద్ధమైన హక్కు తమకు ఉందని ఐఆర్‌జీసీ వెల్లడించింది. ట్రంప్ సైనిక చర్యను తిరిగి ప్రారంభిస్తే.. పశ్చిమాసియా లోని అమెరికా స్థావరాలు, సైనిక బలగాలపై మరిన్ని ఆశ్చర్యకరమైన దాడులు చేస్తామని హెచ్చరించింది.
america-iran-talks-break-middle-east-oil-crisis అమెరికాను హెచ్చరించిన ఇరాన్ సుప్రీం లీడర్
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ అమెరికాను హెచ్చరించారు. శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతుండగా అమెరికా దాడులు చేయడాన్ని ఏ మాత్రం సహించబోమని అన్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని, ఇకపై పశ్చిమాసియాలో అమెరికా బేస్‌లకు ఎక్కడా సురక్షిత ప్రదేశం ఉండదని హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్‌లను నాశనం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. తన తండ్రి, ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతుల్లా ఖమేనీ మరణం తర్వాత కూడా తాము ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దేశం కోసం పోరాడుతున్నామని పేర్కొన్నారు.
