Allu Arjun | టైటిల్ ఈవెంట్ ప్లాన్ ఇదే..

Allu Arjun | టైటిల్ ఈవెంట్ ప్లాన్ ఇదే..

Allu Arjun | బన్నీ- అట్లీ క్రేజీ ప్రాజెక్ట్‌కు సరికొత్త టైటిల్
టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌కు షారుఖ్ ఖాన్ గెస్ట్?
బన్నీ బర్త్‌డే గిఫ్ట్‌గా ఏప్రిల్ 7న టైటిల్ గ్లింప్స్
రూ.700 కోట్ల బడ్జెట్‌తో పాన్ వరల్డ్ మూవీ ప్లాన్

Allu Arjun | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఈ ఇద్దరి కాంబోలో భారీ పాన్ వరల్డ్ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని (Movie) అనౌన్స్ చేసిన తర్వాత దీపిక నటిస్తున్నట్టుగా అప్ డేట్ ఇచ్చారు. అంతకు మించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ క్రేజీ మూవీకి టైటిల్ ఫిక్స్ అయ్యిందని.. ముహుర్తం కూడా ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా టైటిల్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ గెస్ట్ కూడా కన్ ఫర్మ్ అని టాక్. ఇంతకీ.. టైటిల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు..? ఈ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చేది ఎవరు..?

Allu Arjun

Allu Arjun | సరికొత్త టైటిల్..

ఈ క్రేజీ మూవీలో బన్నీ ఇంత వరకు ఎప్పుడూ చూడని పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాని కోలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. అయితే.. ఈ సినిమాకి సూపర్ హీరో అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం జరిగింది. ఆతర్వాత సూపర్ హీరో కాదు.. ఐకాన్ (ICON) అనే టైటిల్ పరిశీలనలో ఉందని మరో వార్త వైరల్ అయ్యింది. ఏ టైటిల్ ఫిక్స్ చేసారో క్లారిటీ లేదు కానీ.. టైటిల్ అయితే ఫిక్స్ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. దీంతో ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీకి ఏ టైటిల్ పెట్టారనేది ఆసక్తిగా మారింది.

Allu Arjun

Allu Arjun | గెస్ట్ గా షారుఖ్..

ఇప్పుడు ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేయడానికి ముహర్తం ఖరారు చేసారని.. బన్నీ పుట్టినరోజైన ఏప్రిల్ 8న ఈ సినిమా టైటిల్ ని ఈవెంట్ ద్వారా ప్రకటిస్తారని తెలిసింది. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ (Bollywood) బాద్ షా షారుఖ్ ఖాన్ రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే.. షారుఖ్ ఆ టైమ్ కి రావడం కుదరకపోతే.. వర్చువల్ గా పాల్గొని ఈ మూవీ టైటిల్ ను రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. షారుఖ్ ఖాన్ తో అట్లీ జవాన్ అనే సినిమా తీయడం.. అది బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.

Allu Arjun

Allu Arjun | ఏప్రిల్ 7న ఉదయం 11.59 నిమిషాలకు..

బన్నీ బర్త్ డే గిఫ్ట్ గా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. అయితే.. ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే. కానీ.. ఒక రోజు ముందుగానే ఈ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అంతే కాకుండా ముహుర్తం కూడా ఖరారు చేసారని ఏప్రిల్ 7న ఉదయం 11.59 నిమిషాలకు ఈ గ్లింప్స్ రిలీజ్ (Release) చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ గ్లింప్స్ షాకింగ్ గాను, ఇప్పటి వరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచేసేలా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ భారీ, క్రేజీ పాన్ వరల్డ్ మూవీని 2027లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. బన్నీ, అట్లీ.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

Leave a Reply