Alair | బీఎస్పీ అభ్యర్థి శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం

Alair | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 11వ వార్డుకు చెందిన బీఎస్పీ అభ్యర్థి ఎలగల శ్రీనివాస్ గురువారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు పరంగా ఉన్న సమస్యల పై 8 ప్రధాన హామీలతో ప్రచారాన్ని చేపట్టారు. బీఎస్పీ నేతలు మొరిగాడి శ్రీశైలం గౌడ్, చింతకింది సోమరుషి పాల్గొన్నారు.

Leave a Reply